మా కుటుంబంలోనూ డిజిటల్ అరెస్ట్: నాగార్జున
TG: ఆరు నెలల క్రితం తమ కుటుంబంలోనూ ఒకరు డిజిటల్ అరెస్టుకు గురయ్యారని ప్రముఖ నటుడు నాగార్జున పేర్కొన్నారు. ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్‌సైట్ తెరిస్తే మన వివరాలు అన్ని వాళ్లకు వెళ్లిపోతాయని సూచించారు. ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్ అని వెల్లడించారు. ఐబొమ్మ ద్వారా రూ.20 కోట్లు సంపాదించారనేది చాలా చిన్న సొమ్మని, వాళ్ల సంపాదన వేల కోట్లల్లో ఉంటుందన్నారు.