'శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం'
VZM: శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బొండపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-14 అథ్లెటిక్స్ పోటీలను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల మార్చ్ ఫాస్ట్‌ను తిలకించారు. అలాగే విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.