చెరువులో మునిగి యువకుడి మృతి
NRPT: నారాయణపేట మండలం కోటకొండ పెద్ద చెరువులో స్నానానికి వెళ్లి ఖాదర్ అనే యువకుడు మృతి చెందాడు. మహబూబ్‌నగర్‌కి చెందిన ఖాదర్, తన బంధువుతో కలిసి భూనీడ్ గ్రామంలో వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా స్నానం కోసం చెరువులోకి దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.