VIDEO: వేపాడలో సీఐటీయూ నిరసన

VZM: స్మార్ట్ మీటర్లు మాకొద్దంటూ సీఐటీయూ నాయకుడు జగన్ ఆధ్వర్యంలో జాకేరు సబ్ స్టేషన్‌లో ఆందోళన నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల వల్ల పేద, గిరిజన, సాధారణ వినియోగదారులకు భారం అవుతుందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పలువురు సీఐటీయూ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.