వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

బాపట్ల: టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహాయంతో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేమూరులోని పోటుమెరక జలార్తమ్మ కాలనీలో నిర్మాణమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రెండవ శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్సంగ కార్యక్రమం, అన్నప్రసాద వితరణ జరిగింది.