మంటలు ఎగసిపడి బాలుడికి తీవ్ర గాయాలు
KRNL: క్రిష్ణగిరి మండలం తెగదొడ్డిలో ప్రమాదవశాత్తు పొలంలో మంటలు ఎగిసి బాలుడికి గాయాలైన ఘటన ఇవాళ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు పొలంలో పత్తి కట్టే అంటించడానికి తన వెంబడి కుమారుడు మహేంద్రను తీసుకుని వెళ్లారు. పొలంలో పత్తి కట్టే అంటించగా మంటలు ఎగసిపడి పక్కనే ఉన్న కుమారుడిపై పడంతో తీవ్ర గాయాలయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు.