ముత్తాయికోట ఆలయంలో భక్తుల రద్దీ

ముత్తాయికోట ఆలయంలో భక్తుల రద్దీ

MDK: కార్తీక మాసం సోమవారం కావడంతో ప్రసిద్ధ ముత్తాయికోట శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిట కిటలాడింది. మెదక్ పట్టణానికి సమీపాన ఉండడంతో ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆలయ పూజారులు పంచామృతాలతో అభిషేకం, అలంకరణ, పూజలు, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ చేశారు. మహిళలు దీపాలు వెలిగించి దీప దానం నిర్వహించారు.