VIDEO: 'కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగంపై చిత్తశుద్ధి లేదు'
NLG: కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు, రైతాంగంపై ప్రేమ, చిత్తశుద్ధి లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. అనేక మంది రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసినా ధాన్యం కొనుగోలు కావడం లేదని విమర్శలు చేశారు. ధాన్యం మార్కెట్‌లోకి వచ్చి 30 రోజులు అవుతున్నా కూడా కోనుగోలు చేయకుండా మ్యాచర్ పేరుతో అధికారులు మోసం చేస్తున్నారని ఆరోపించారు.