పీహెచ్‌సీలో 'అమ్మ ఒడి' కార్యక్రమం

పీహెచ్‌సీలో 'అమ్మ ఒడి' కార్యక్రమం

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఇవాళ 'అమ్మ ఒడి' కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వైద్యురాలు దివ్య ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన గర్భిణీలకు రక్త పరీక్షలు, ఎత్తు, బరువు, రక్తపోటు పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా అవసరమైన వారికి మందులు పంపిణీ చేసి, పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాధాన్యతను వివరించారు.