ఆమనగల్లు‌లో 36 మందిని కరిచిన పిచ్చి కుక్క

ఆమనగల్లు‌లో 36 మందిని కరిచిన పిచ్చి కుక్క

రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ పట్టణంలో పిచ్చి కుక్క స్వైర విహారంతో 36 మందిపై దాడి చేసి కరిచింది. రోడ్డుపై కనిపించిన వారినందరినీ కర్చుకుంటూ వెళ్లింది. ఆగ్రహించిన బాధితులు కుక్కను చంపేశారు. దాడిలో గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 36 మంది కుక్కగాటుకు గురయ్యారని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.