'అబద్ధానికి ప్యాంటు, చొక్కా తొడిగితే జగన్'

'అబద్ధానికి ప్యాంటు, చొక్కా తొడిగితే జగన్'

AP: మాజీ సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల శ్రీవారి పట్ల జగన్‌కు ఎలాంటి భక్తి విశ్వాసాలు లేవన్నారు. 'పరకామణి చోరీ కేసు విషయం జగన్‌కు చాలా చిన్న అంశం. శ్రీవారి పట్ల వ్యవహరించిన తీరు వల్లే స్వామివారి ఆగ్రహానికి గురయ్యారు. బెదరకుండా అబద్ధాలు మాట్లాడే వ్యక్తి జగన్ ఒక్కరే. అబద్ధానికి ప్యాంటు, చొక్కా తొడిగితే అది జగన్' అని విమర్శించారు.