హైడ్రా కమిషనర్‌కు విద్యార్థినులు ఫిర్యాదు
TG: గొల్కోండ జౌటర్ రింగురోడ్డు నీటిలో మునుగుతుండటంపై విద్యార్థినులు హైడ్రాకమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆ నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. వరద కాలువల్లో పూడిక తొలగిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కమిషనర్ వెంటనే పూడిక తొలగింపు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.