చేనేత కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నాయకుడు
సత్యసాయి: ధర్మవరం బాలాజీ నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు బోనాల హరికృష్ణ అప్పుల బాధతో శనివారం తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకుడు సంధా రాఘవ తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం ప్రకటించాడు. రాఘవ సూచన మేరకు టీడీపీ నాయకుడు పురుషోత్తం, నారాయణస్వామి హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆ నగదును అందజేశారు.