కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులపై ఎంపీ సీరియస్

కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులపై ఎంపీ సీరియస్

BDK: రైల్వే స్టేషన్ పనుల జాప్యంపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుకున్న సమయానికి పనులు జరగకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వివరించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు.