కాశీబుగ్గలో 25న జాబ్ మేళా

SKLM: కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో 25న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధికారి సాయికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 30 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.