గంగపూజ నిర్వహించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
ATP: హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలతో నిండిన అనంతపురం రూరల్ మండలంలోని కక్కలపల్లి చెరువు వద్ద గంగపూజ జరిగింది. ఈ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన జ్యోతుల ఊరేగింపులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. నీటితో నిండిన చెరువును చూసి ఆమె హర్షం వ్యక్తం చేశారు. రైతులకు సాగు, తాగునీటి సమస్య తీరిందని ఆమె పేర్కొన్నారు.