కొత్త సినిమా ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శంబాల' మూవీ డిసెంబర్ 25న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. దీని ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన విషెస్ చెప్పారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రం సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది.