మహమ్మదాబాద్ లో పట్టపగలే భారీ చోరీ

MBNR: జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, పక్కనే శివగోపాల్ దుకాణంలో రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.