రామతీర్థం శివరాత్రి ఉత్సవాలకు బందోబస్తు
VZM: రామతీర్థం శివరాత్రి జాతరలో మొత్తం 186 మందితో బందోబస్తు నిర్వహిస్తామని భోగాపురం రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. 15, 16వ తేదీల్లో జరిగే జాతరలో ఎస్‌వోపీవో స్థాయి అధికారి పర్యవేక్షణలో ఐదుగురు సీఐలు, 24 మంది ఎస్ఐలు, 12 మంది ఏఎస్ఐలు బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు. మరో 150 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులతో బందోబస్తు నిర్వహిస్తామన్నారు.