కలెక్టర్‌ను కలిసిన జిల్లా వైద్యాధికారి
GDWL: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె. సంధ్యా కిరణ్మయి కలెక్టర్ సంతోష్‌ను కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆయనను కలిసి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ జిల్లాను అన్ని పారామీటర్స్‌లో ముందు ఉంచాలని, ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.