వేసవికి ముందస్తు త్రాగునీటి ఏర్పాట్లు
WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో రానున్న వేసవి కాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మండల పంచాయతీ అధికారి భావన తెలిపారు. గురువారం గ్రామ సర్పంచ్ జక్కీ అనిత శ్రీకాంత్‌తో కలిసి బోరు బావులు, మిషన్ భగీరథ ట్యాంకులు, పైపులైన్లను పరిశీలించి, పాడైన బోరు బావులను మరమ్మతులు చేస్తామని చెప్పారు.