VIDEO: ఘనంగా ఏఎంసీ పాలకవర్గం ప్రమాణస్వీకారం

కోనసీమ: అంబాజీపేట మండలంలోని అంబాజీపేట మార్కెట్ యార్డులో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఛైర్మన్‌గా శ్రీ చిట్టూరి శ్రీనివాస్, వైస్ ఛైర్మన్‌గా కొర్లపాటి వెంకటేశ్వరరావు ప్రమాణం చేశారు. వీరితో పాటు డైరెక్టర్లు కూడా పదవీ ప్రమాణం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.