వర్ధన్నపేటలో 100 పడకల ఆసుపత్రి స్థలం పరిశీలన
WGL: వర్ధన్నపేట పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన దేవాదాయ శాఖ భూమిని ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు ఇవాళ పరిశీలించారు. స్థలానికి త్వరగా బౌండరీలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పట్టణంలోనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం లక్ష్యమని తెలిపారు. ఆసుపత్రి కోసం భూమి కేటాయించిన మంత్రి సురేఖకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.