వైద్య విద్యార్థినికి ఆర్థిక సాయం

KRNL: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన రాజేశ్–సుజన దంపతుల కుమార్తె క్రాంతి మెడికల్ సీటు సాధించింది. ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రసన్నరాజు, మాదన్న, ప్రకాశ్ ఆధ్వర్యంలో ఆమె చదువుకోసం రూ. 35 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.