మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే
NTR: జగ్గయ్యపేట మండలం, అనుమంచిపల్లి బలుసుపాడు గ్రామాల రైతులకు చెందిన వరి, ప్రత్తి, మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పంట నష్టాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నుండి తగిన నష్టపరిహారం మంజూరు చేయించి రైతులకు న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు.