విద్యుత్ పునరుద్ధరణకు మరమ్మతులు

WGL: నర్సంపేట పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ ఈదురు గాలులతో పట్టణంలోని పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. చెట్ల కొమ్మలతో తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్, మున్సిపల్ సిబ్బంది పునరుద్దరణకు చర్యలు చేపట్టారు. 19వ వార్డులో పునరుద్ధరణ పనులను పరిశీలించారు.