VIDEO: నరసరావుపేటలో రూ.5 లక్షల చోరీ
PLD: నరసరావుపేట బైపాస్ జొన్నలగడ్డ వద్ద భారీ చోరీ జరిగింది. ఇక్కడి హోల్‌సేల్ ఉల్లిపాయల దుకాణం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఉల్లిపాయలు కొనేందుకు దుకాణంలోకి వెళ్లాడు. బయటకు వచ్చేసరికి స్కూటీలో ఉంచిన రూ.5 లక్షల నగదు మాయమైంది. క్షణాల్లోనే దుండగులు ఈ నగదును అపహరించారు. ఈ చోరీ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.