వలస కార్మికులకు భరోసా: కలెక్టర్

వలస కార్మికులకు భరోసా: కలెక్టర్

కోనసీమ: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేవారికి అన్ని విషయాలలో కోనసీమ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ మార్గదర్శకం చేస్తుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద విదేశాల్లో ఉపాధి కోసం నకిలీ ఏజెంట్ల చేతులలో మోసపోయిన వారితో సమావేశం నిర్వహించారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు లేదా సమాచారం కావాల్సిన వారు టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-0498ను సంప్రదించాలని కోరారు.