వినుకొండ మున్సిపాలిటీలో కొత్తగా 4 వార్డులు

వినుకొండ మున్సిపాలిటీలో కొత్తగా 4 వార్డులు

PLD: వినుకొండ మున్సిపాలిటీలో కొత్తగా 4 వార్డులు ఏర్పాటు కానున్నాయి. దీంతో మొత్తం వార్డుల సంఖ్య 36కు చేరుతుందని కమిషనర్ శివరామ్ ప్రసాద్ తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పునర్విభజన జరుగుతుంది. దీనిపై ఏప్రిల్ 9 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లలో వినుకొండ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు.