VIDEO: వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

HNK: ఎల్కతుర్తి మండలంలోని గోపాలపురం గ్రామంలో హఠాత్ సంఘటన చోటు చేసుకుంది. జీలగుల వాగులో చిక్కుకున్న రామయ్యను శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గ్రామస్తులు డయల్ 100 ద్వారా సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సహాయంతో రామయ్యను సురక్షితంగా బయటకు తీసుకొని ప్రాణాపాయాన్ని నివారించారు.