అన్నదాన సత్రం భవనానికి శంకుస్థాపన

అన్నదాన సత్రం భవనానికి శంకుస్థాపన

NGKL: బిజినేపల్లి వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య అన్నదాన సత్రం కోసం అదనపు వసతి భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. దాతలు సి. సురేందర్ రెడ్డి, ఎస్. రాజమహేంద్ర రెడ్డి దంపతుల ఆర్థిక సహకారంతో భవనం నిర్మిస్తున్నారు. అర్చకులు ప్రసాద్ స్వామి, నవీన్ స్వామి ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.