'ప్రైవేట్ లాడ్జీల నిర్వహకులు నిబంధనలు పాటించాలి'
SRCL: ప్రైవేటు లాడ్జిల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ సూచించారు. లాడ్జిలకు వచ్చే అతిధుల వద్ద పూర్తి ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని, మైనర్లకు గదులు ఇవ్వవద్దని, లాడ్జీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, రికార్డులు సరిగ్గా నిర్వహించాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.