దామోద‌ర దీపోత్స‌వం ప్రారంభం

దామోద‌ర దీపోత్స‌వం ప్రారంభం

విశాఖలోని ఐఐఎం రోడ్‌లో ఉన్న శ్రీ శ్రీ రాధా మధన మోహన్ మందిరంలో దామోదర దీపోత్సవం వైభవంగా సోమ‌వారం రాత్రి ప్రారంభమైంది. కార్తీక మాస పురస్కరించుకుని ఈ దీపోత్సవాన్ని నవంబర్ 5, 2025 వరకు నెల రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు హరే కృష్ణ మూవ్‌మెంట్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా హారతి, సంకీర్తన నిర్వహించారు.