ఉపాధ్యాయుడికి PHD పట్టా

NZB: భీమ్గల్ మండలం పల్లికొండ జడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ బీవీ వర్మ పర్యావరణ శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందారు. నిజామాబాద్ శివారులోని న్యాల్కల్ చెరువుపై 'లిమ్నాలజికల్ స్టడీస్' అనే అంశంపై పరిశోధన చేసి, నీటి నాణ్యత, భౌతిక, రసాయనిక లక్షణాలను విశ్లేషించారు. అంతేకాకుండా జూప్లాంక్టన్ వైవిధ్యాన్ని కూడా అధ్యయనం చేశారు.