సఖి సెంటర్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్
BHNG: జిల్లాలో మహిళల భద్రత, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సఖి సెంటర్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. ఈసందర్భంగా హౌసింగ్ బోర్డ్‌లోని సెంటర్‌లో సిబ్బంది అందిస్తున్నసేవలు, బాధిత మహిళలకు తక్షణ సేవలు అందేలా పనిచేయాలని సూచించారు. అనంతరం మాస్కుంటలోని సఖి భవనం, సింగన్నగూడెంలోని బాలసదనం పనులను పరిశీలించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.