గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారికి ఉచిత బస, ఫుడ్

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారికి ఉచిత బస, ఫుడ్

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పలువురు భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. వారికి సహాయం చేసేందుకు దుబాయికి చెందిన భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త యోగేష్ దోషి ముందుకొచ్చారు. దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారతీయులు బస చేసేందుకు తన నివాస భవనంలోని 64 అపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చారు. వారికి ఉచితంగా ఆహారం సైతం అందిస్తున్నారు.