మారణకాండ.. 100 మంది చిన్నారుల బలి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో ఇప్పటివరకు 100 మందికి పైగా చిన్నారులు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఈనెల 2న ప్రారంభమైన ఈ యుద్ధ ఉద్రిక్తతల్లో మొత్తం మరణాల సంఖ్య 680 దాటింది. కేవలం చిన్నారులే కాకుండా మహిళలు, వైద్య సిబ్బంది కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది ప్రజలు నిర్వాసితులుగా మారుతున్నారు.