'జిల్లాలో గ్యాస్,పెట్రోల్, డీజిల్ కొరత లేదు'
జగిత్యాల జిల్లాలో ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులకు ఎటువంటి కొరత లేదని జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. వదంతులను నమ్మవద్దని, గృహ వినియోగాలకు వాడే సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న 52 మందిపై 6ఏ కేసులు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.