వైభవంగా అమ్మవారి ఆలయ ప్రతిష్ట

వైభవంగా అమ్మవారి ఆలయ ప్రతిష్ట

VZM: దత్తిరాజేరు మండలం గడసాంలో బంగారమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దీంతో గ్రామమంతా భక్తి వాతావరణంతో మారుమోగింది. అమ్మవారికి అభిషేకాలు, అలంకరణలు, మంగళహారతులను అర్చకులు వేదమంత్రాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య హాజరయ్యారు.