కెనాల్ పనులను వేగవంతం చేయాలని మంత్రికి వినతి
సత్యసాయి: మడకశిర బైపాస్ కెనాల్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటివనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు కోరారు. బైపాస్ కెనాల్ నిర్మాణానికి సత్వర నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే.. మంత్రికి వినతిపత్రం సమర్పించారు. మంత్రి నిమ్మల సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.