నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: కొండేపి మండలంలోని కె.ఉప్పలపాడు గ్రామం‌లో కొత్తగా ఫీడర్ ఎల్సీలు ఏర్పాటు చేస్తున్నందున శనివారం కె.ఉప్పలపాడు, చినవెంకన్నపాలెం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ పి. శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రెండు గ్రామాలకు ఉదయం 9 నుం చి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.