మైలారం రిజర్వాయర్‌లో గుర్తుతేయని మృతదేహం లభ్యం..!

మైలారం రిజర్వాయర్‌లో గుర్తుతేయని మృతదేహం లభ్యం..!

WGL: రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్‌లో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మత్స్యకారులు దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సారెస్పీ కెనల్‌లో ఆగిపోయిన నీటి ప్రవాహం కారణంగా దేహం బయటకు వచ్చింది. వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు.