'కేటీఆర్ ఏదో నీతిమంతుడిలా మాట్లాడుతున్నారు'
MLG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కోంటున్న MLAలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క స్పందించారు. "BRS అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ MLAలను, MLCలను మీ పార్టీలోకి తీసుకున్నారు. KTR ఏదో నీతిమంతుడిలా ఈ విషయంపై మాట్లాడుతున్నారు. ముందు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత ఫిరాయింపులపై మాట్లాడాలి.. స్పీకర్ తన పరిధి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు." అని అన్నారు.