వేంకటరమణ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

వేంకటరమణ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

CTR: పుంగనూరు పట్టణం కోనేటి పాళ్యం సమీపానగల శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి వారి ఆలయంలో ఉగాది సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ మొదలైంది. ఉదయమే అర్చకులు శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అభిషేకం, ఉగాది అస్థానం నిర్వహించారు. తర్వాత భక్తుల దర్శనార్థం ఉత్సవ మూర్తులను అలంకరించి అద్దాల మండపంలో కొలువు తీర్చారు. భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.