నేడు నీటి శుద్ధి కేంద్రం ప్రారంభోత్సవం.. హాజరుకానున్న మంత్రి

నేడు నీటి శుద్ధి కేంద్రం ప్రారంభోత్సవం.. హాజరుకానున్న మంత్రి

ATP: కూడేరు మండలం ముద్దలపురం వద్ద నూతనంగా నిర్మించిన 16 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.