విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేత

VZM: 10వ తరగతి పరీక్షలలో జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు JC సేతు మాధవన్ ప్రతిభ స్కాలర్‌షిప్, ప్రశంసా పత్రాలు అందజేశారు. సోమవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో విద్యార్థులకు చెక్కు, ప్రశంసా పత్రం అందజేశారు. బొబ్బిలి మండలం గొల్లపల్లి, గజపతినగరం మండలం లక్కిడం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన నలుగురికి అందజేశారు.