VIDEO: భీమిని PHCలో నేడు ప్రత్యేక ఆరోగ్య శిబిరం
MNCL: భీమిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుంచి నరాలకు సంబంధించిన వ్యాధులు, BP, షుగర్, ఫిట్స్ అనేక రకాలైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా పరీక్షలు, చికిత్స అందించనున్నట్లు అధికారులు మండలంలో డప్పు చాటింపు చేయించారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలని వైద్యులు కోరారు.