VIDEO: రైతులకు నష్టపరిహారాన్ని అందించాలి: ఎమ్మెల్యే
కోనసీమ: మొంథా తుఫాన్ కారణంగా పీ.గన్నవరం నియోజకవర్గంలో పంటలను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కోరారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా ఇంఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కమిటీ సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే హాజరై ఈ విషయాన్ని తెలియజేశారు.