నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా ఎనలిస్ట్ కోర్సుల్లో 3 నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. 17 నుంచి 30 సంవత్సరాల వయసు, ఇంటర్/డిగ్రీ పూర్తైన అభ్యర్థులు అర్హులన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు ఈ క్రింది 800 8822 821 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.