CHC సెంటర్‌లో గర్భిణీల మరణాలు. కారణాలేంటి..?
SKLM: సారవకోట(M) బుడితి CHCలో గర్భిణీల వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఈ సెంటర్‌లో ఒకేరోజు ఇద్దరు గర్భిణీలు మృతి చెందారు. తాజాగా శనివారం మరో గర్భిణీ మరణించింది. అయితే, శస్త్రచికిత్సల అనంతరం మరణాలు జరుగుతున్నాయి. ఇంతా జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండడంతో స్థానికులు ఆగ్రహానికి గురవుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.